బాలీవుడ్ స్టార్హీరో సైఫ్ అలీఖాన్ కూతురు, నటి సారా అలీఖాన్ డ్రైవర్‌కు కరోనా సోకింది. దీంతో సైఫ్అలీఖాన్ కుటుంబసభ్యులు భయందోళనకు గురయ్యారు. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోగా వారందరికీ నెగెటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా సారా ట్వట్టర్ ద్వారా తెలియజేశారు. మరోవైపు ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. రోజుకు వేలల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా వైరస్ సోకింది. ఈ నలుగురు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురు కరోనా బారినపడ్డారు.
- July 14, 2020
- Archive
- జాతీయం
- సినిమా
- BOLLYWOOD
- CARONA
- DRIVER
- SARA
- బాలీవుడ్
- సారా అలీఖాన్
- Comments Off on సారా అలీఖాన్ డ్రైవర్‌కు కరోనా