మొన్నటి వరకు బిగ్ బాస్ –4 తెలుగుతో బిజీగా ఉన్నారు అక్కినేని నాగార్జున. రీసెంట్గా ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. నెక్ట్స్ షూటింగ్ కు నాగార్జునకు కొంచెం సమయం చిక్కినట్టుంది. ఫ్రీ టైమ్ను నాగ్ కి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఉంది. అలాగే తాజాగా ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నం.49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో నాగార్జున వాల్గో ఇన్ ఫ్రా ఎండీ సీఈవో శ్రీధర్ రావుతో కలిసి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు.. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ ఇంకా ఎన్నో ప్రత్యేకమైన చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమానంతరం అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని నాగార్జున కాసేపు సేదతీరారు. మాస్టర్ అబూశ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని నాగార్జున కాసేపు చిన్నారితో ఆడుకున్నారు. ఆ తర్వాత కాలనీవాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు, కాలనీవాసులు పాల్గొన్నారు.
- December 27, 2020
- Archive
- Top News
- షార్ట్ న్యూస్
- సినిమా
- AKKINENI NAGARJUNA
- BIGBOSS4
- WALGOINFRA
- WILDDOG
- అక్కినేని నాగార్జున
- బిగ్ బాస్ –4
- వాల్గో ఇన్ ఫ్రా ఎండీ
- వైల్డ్ డాగ్
- Comments Off on సామాజిక కార్యక్రమాల్లో నాగ్