సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: నియంత్రిత పంటల సాగు విధానంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం గంభీరావుపేట మండల జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరయ్యారు. గంభీరావుపేట మండలంలో రూ.22కోట్ల వ్యయంతో నాలుగు చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నామని, కాల్వల భూసేకరణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్యాకేజీ 9, 12 ద్వారా గంభీరావుపేట మండలంలో 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సమావేశంలో టిస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్పీచైర్‌పర్సన్ అరుణ పాల్గొన్నారు.
- June 10, 2020
- కరీంనగర్
- తెలంగాణ
- KTR
- RAJANNA CIRICILLA
- కాళేశ్వరం
- గంభీరావుపేట
- Comments Off on సాగుపై దుష్ప్రచారం తిప్పికొట్టండి