Breaking News

సర్ఫరాజ్​కు పిలుపు

లాహోర్: మూడు టెస్టులు, మూడు టీ20ల కోసం వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. ఈ రెండు సిరీస్​ల కోసం మొత్తం 29 మందిని ఎంపికచేశారు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించిన కొత్త కుర్రాడు హైదర్ అలీకి తొలిసారి అవకాశం కల్పించారు. అయితే మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​ను జట్టులోకి తీసుకొచ్చి సెలెక్టర్లు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మిగతా జట్టులో అనుహ్యమైన మార్పులు చేయలేదు. ఈ సీజన్ దేశవాళీ టోర్నీలో విశేషంగా రాణించడం హైదర్​కు కలిసొచ్చింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఏసీసీ ఎమర్జింగ్‌ కప్‌తో పాటు అండర్‌–19 టీమ్ తరఫున హైదర్ రెండో అత్యధిక స్కోరు సాధించాడు. వ్యక్తిగత కారణాలతో పర్యటనకు దూరంగా ఉన్న పేసర్‌ మహ్మద్‌ అమిర్‌, హారిస్‌ సోహైల్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. బిలాల్‌ ఆసిఫ్, ఇమ్రాన్‌భట్‌, ముసా ఖాన్‌, మహ్మద్‌నవాజ్‌ను రిజర్వ్‌ప్లేయర్‌గా ఎంపిక చేశారు.
పాక్‌ జట్టు: అజర్‌అలీ (కెప్టెన్‌), అబిద్‌అలీ, పక్హర్‌జమాన్‌, ఇమామ్‌ఉల్‌హక్‌, షాన్‌మసూర్‌, బాబర్‌ఆజమ్‌(టీ20 కెప్టెన్‌), అసద్‌షఫీక్‌, ఫవాద్‌ఆలమ్‌, హైదర్‌అలీ, ఇఫ్తికార్‌అహ్మద్‌, కుష్ది షా, మహ్మద్‌హఫీజ్‌, షోయబ్‌మాలిక్‌, మహ్మద్‌రిజ్వాన్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఫాహిమ్‌అష్రాఫ్‌, హారిస్‌రౌఫ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, మహ్మద్‌అబ్బాస్‌, మహ్మద్‌హసనైన్‌, నసీమ్‌షా, షాహిన్‌ఆఫ్రిది, సోహైల్‌ఖాన్‌, ఉస్మాన్‌షెన్వారీ, వహాబ్‌రియాజ్‌, ఇమద్‌వసీమ్‌, కాశిఫ్‌భట్టి, షాదాబ్‌ఖాన్‌, యాసిర్‌షా.