సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ ఓ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటువేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కళ్లకల్ సర్పంచ్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 6న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కళ్లకల్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారం మొక్కలు చనిపోవడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేయకపోవడం, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కలెక్టర్ సర్పంచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ మల్లేష్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకపోవడంతో ఆరునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అప్పటివరకు ఉప సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తారని స్పష్టంచేశారు.
- July 1, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- KALLAKAL
- medak
- SURPUNCH
- కళ్లకల్
- మెదక్
- సర్పంచ్
- Comments Off on సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు