‘మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్లో మహేశ్‌బాబు చేతితో రూపాయి కాయిన్‌ను ఎగరవేస్తూ కనిపిస్తున్నాడు. కేవలం మహేశ్‌బాబు చెయ్యి మాత్రమే కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. కాగా మోషన్ పోస్టర్ చూసి ఫ్యాన్స్ కొంత నిరాశచెందినట్టు సమాచారం. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. సోషల్ మీడియాలో మహేశ్‌కు సినీ సెలబ్రిటీలు, అభిమానుల నుండి పుట్టినరోజు అభినందనలు వెల్లువెత్తున్నాయి.
- August 9, 2020
- Archive
- Top News
- సినిమా
- BIRTHDAY
- FANS
- MAHESHBABU
- POSTER
- REALESE
- WISHES
- మహేశ్‌బాబు
- మోషన్ పోస్టర్
- Comments Off on ‘సర్కార్‌వారిపాట’పోస్టర్.. ఫ్యాన్స్ నిరాశ