సినిమా కోసం సెట్స్ వేయడం కామనే అయినా ఒరిజినల్ లొకేషన్ లో తీసిన ఫీల్ వేరుగా ఉంటుంది. కానీ ఔట్ డోర్ షూటింగ్ లో ఇబ్బందులు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ కరోనా క్రైసిస్‌లో అవి కాస్త ఎక్కువయ్యాయి కూడా. ముఖ్యంగా షూటింగ్ కోసం ఇతర దేశాలు వెళ్లేవాళ్లు ఈ ఇబ్బందులు ఎక్కువే ఎదుర్కొంటున్నారు. అయితే మహేష్ బాబు సినిమా ‘సర్కారు వాటి పాట’ కోసం ఓ ఫారిన్ లొకేషన్ సెట్ వేయాల్సి ఉందట. అమెరికా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఇందుకోసం ఫారిన్ బ్యాంక్ సెటప్ అవసరమైంది. అందులో కీలకమైన సీన్స్ తీయాల్సి ఉండడంతో, ఫారిన్ బ్యాంక్ ని పోలిన భారీ సెట్ ని వేయాలనుకున్నారు. కానీ ఇప్పుడా అవసరం లేదు. ఎందుకంటే చికాగోలో అందుకు తగ్గ ఒరిజినల్ బ్యాంక్ బిల్డింగ్ కి పర్మిషన్ లభించిందట. త్వరలోనే అమెరికా వెళ్లనున్న టీమ్, అక్కడే షూటింగ్ చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మనీ ల్యాండరింగ్, ఫైనాన్షియల్ స్కామ్స్ చుట్టూ తిరిగే కథ. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
- December 22, 2020
- Archive
- Top News
- సినిమా
- KEERTHISURESH
- MAHESHBABU
- SARKARUVARI PATA
- కీర్తిసురేష్
- చికాగో
- మహేష్‌బాబు
- సర్కారు వాటి పాట
- Comments Off on సర్కారు వారి సెట్ లో