సినిమా షూటింగ్ లను ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినప్పటికీ షూటింగ్ లకు హాజరయ్యేందుకు స్టార్ హీరో హీరోయిన్లు జంకుతుండంతో చాలా సినిమాల షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పటికే మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. అయితే మహేష్ బాబు పరుశురామ్ కాంబినేషన్లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేందుకు తటపటాయిస్తోంది. ఈ విషయంలో మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నారట.
డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నారట. షూటింగ్ షురూ చేయడానికి ఇంకా సమయం పట్టేలా ఉండడంతో ముందే అన్నిపాటల రికార్డింగ్ కూడా పూర్తిచేసి సిద్ధంగా ఉంచుకుంటే బెటర్ అన్న పాలసీతో ముందుకెళ్తున్నారట. అదిగాక ఇప్పుడు ఎక్కువ సమయం దొరుకుతుండడంతో మరింత క్వాలిటీగా రూపొందించవచ్చని అంటున్నారు. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రస్తుతం పాటల పని జరుగుతోంది. ఇక వ్యాక్సిన్ వచ్చాకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కీర్తీసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని మహేష్‌కు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి.