దిగ్జజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతిచెందారు. గతనెల 20న ఆమె శ్వాసకోసం ఇబ్బందులతో ముంబైలోని గురునానక్ దవాఖానలో చేరారు. అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో బాలీవుడ్ సినీపరిశ్రమలో విషాదం నెలకొన్నది. సరోజ్‌ఖాన్ దాదాపు రెండువేల పాటలకు సరోజ్‌ఖాన్ కొరియోగ్రాఫ్ అందించారు. దేవదాస్లోని డోలారే డోలాకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి నటించిన నాగిని, మిస్టర్ ఇండియా చిత్రాలకు ఆమె డాన్స్ కంపోజ్ చేశారు. యువతను ఉర్రూతలూగించిన ‘ఏక్దోన్తీన్’ పాటకు ఆమె డాన్స్ కంపోజ్ చేశారు. మూడు సార్లు ఆమెను జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 1948 నవంబరు 22న సరోజ్ ఖాన్ జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. భర్త సోహన్ లాల్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.