Breaking News

సరళాసాగర్ నీటి విడుదల

సరళాసాగర్ నీటి విడుదల

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్​రిలీజ్​ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.