సారథి న్యూస్, తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను బుధవారం ఛత్తీస్ ఘడ్ మాజీ మంత్రి మహేశ్ఘగడ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆలయ పూజారులు డోలీలతో కలిసి ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ఆమె పూజలు చేశారు. కార్యక్రమంలో బీజాపూర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముడిలియర్, మండలాధ్యక్షుడు డోలేశ్ రాజ్ విర్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండలాధ్యక్షులు జాలాపు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లు దేవేందర్, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, జిల్లా నాయకులు అర్రేమ్ లచ్చూ పటేల్, సర్పంచ్ ఇరాప సునీల్, డైరెక్టర్ మల్లన్న, సురేష్, యూత్ అధ్యక్షుడు పూర్ణచందర్, పూజారులు సిద్ధబోయిన స్వామి, సమ్మక్క, సారలమ్మ ఆలయ పూజారులు పాల్గొన్నారు.
- December 16, 2020
- Archive
- తెలంగాణ
- వరంగల్
- CHATTISGARH
- MEDARAM
- MLA SITHAKKA
- MULUGU
- SAMMAKKA
- SARALAMMA
- ఎమ్మెల్యే సీతక్క
- ఛత్తీస్ ఘడ్
- ములుగు
- మేడారం
- సమ్మక్క
- సారలమ్మ
- Comments Off on సమ్మక్క సారలమ్మ సన్నిధిలో..