ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ లో ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత కూడా ఓ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయబోతున్నాన్నంటూ ప్రకటించింది. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరో వైపు స్వచ్ఛంద సంస్థను కూడా నిర్విహిస్తోంది. ఆల్రెడీ సమంత తన రంగంలో మొదటి మెట్టుపై ఉంది. అలాగే మోడలింగ్ లో పలు బ్రాండ్ యాడ్స్ లో కూడా నటించింది. ఇప్పుడు సొంతంగా ఓ ఫ్యాషన్ వరల్డ్ ను క్రియేట్ చేస్తుందట. లేటెస్ట్ గా తన అడుగు బిజినెస్ వైపు వేయడానికి రెడీ అయింది. అంతేకాదు అది తన డ్రీమ్ అని కూడా అంటోంది. ‘సాకీ వరల్డ్’ అనే పేరుతో క్లాత్ బిజినెస్ ఔట్ లెట్ ను ప్రారంభించబోతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికీ అందుబాటులో ఉండే ధరలతో సాకీ వరల్డ్ ఉంటుందని సమంత పేర్కొంది. త్వరలో మొదటి ఔట్ లెట్ ను ప్రారంభించి ఆ తర్వాత చైన్ సిస్టంతో హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, వైజాగ్ లో కూడా విస్తరించనున్నట్లుగా సమాచారం. నటిగా మంచి పేరు తెచ్చుకున్న సమంత ఇప్పుడు బిజినెస్ వుమన్ గా కూడా మారనుందన్నమాట.
- September 6, 2020
- Archive
- Top News
- సినిమా
- NAGACHAITANYA
- NAGARJUNA
- SAMANTHA
- SOCKYWORLD
- నాగచైతన్య
- నాగార్జున
- సమంత
- సాకీ వరల్డ్
- Comments Off on సమంత కొత్త బిజినెస్