Breaking News

సబ్ రిజిస్ట్రార్ చేయూత

సారథి న్యూస్, ములుగు: రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి, తినడానికి తిండి లేదు. నిలువ నీడ లేదు, విధి వెక్కిరించి వీధినపడ్డ ఓ నిరుపేద కుటుంబానికి చేయుతనందించి సహృదయాన్ని చాటుకున్నారు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన రెడ్డబోయిన రాజు, మానస దంపతులకు వైష్ణవి, తేజశ్విని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కిరాయి ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో రాజు కాలు కోల్పోయాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. పిల్లల పోషణ, ఇంటి కిరాయికి ఇబ్బందిపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తల్లి మానస ఆత్మహత్యకు పాల్పడింది. వారి ఆర్థికస్థితిగతులు తెలుసుకుని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గురువారం 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు, చెప్పులు, రూ.మూడువేల ఆర్థికసాయం చేశారు. ఆయన వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు మామిడిపెల్లి రమేష్, ఇంజపెల్లి నవీన్, చంటి సామ్యూల్, బషీర్ పాల్గొన్నారు