నారాయణఖేడ్, సారథి న్యూస్: అయోధ్యలోని రామమందిర భూమిపూజ కార్యక్రమానికి వెళ్లిన కొండాపూర్ హనుమాన్ ఆలయ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్ ధన్యజీవి అని నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అయోధ్య రామమందిర భూమిపూజకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన ఒక్కరికి పిలుపువచ్చిన విషయం తెలిసిందే. సంగ్రాం మహారాజ్ అయోధ్యలోని రామమందిర భూమిపూజకు హాజరై శనివారం ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయనను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మర్యాపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. సంగ్రాం మహారాజ్ లాంటి గొప్పవ్యక్తి తెలంగాణ గడ్డమీద పుట్టడం మన అదృష్టమన్నారు. అనంతరం స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- August 8, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- AYODHYA
- BOOMIPUJA
- KONDAPUR
- MLA
- SANGRAM
- ఆయోధ్య భూమిపూజ
- ఆహ్వానం
- తెలంగాణ
- పీఠాధిపతి
- సంగ్రాం మహారాజ్
- Comments Off on సంగ్రాం మహారాజ్ ధన్యజీవి