Breaking News

షూటౌట్ ఎట్ ఆలేరు.. వెబ్ సిరీస్

షూటౌట్ ఎట్ ఆలేరు.. వెబ్ సిరీస్


చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన చిరంజీవి డాటర్ సుస్మిత రీసెంట్ గా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ నిర్మించింది. 2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్.. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా ఈ వెబ్‌ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, తేజ, నందిని కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈనెల 25నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ హాజరయ్యారు. షో రీల్ లాంచ్ చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడే తిరిగి స్ట్రాంగ్ అవుతుంది. జీ5 ఓటీటీలో మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. సుష్మిత మా ఫ్యామిలీ నుంచి ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసింది. చిన్నప్పట్నుంచీ చాలా కష్టపడుతుంది. తనతో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది. నా ప్రొడక్షన్ తో పాటు నాకు కూడా ‘రంగస్థలం’ సినిమా స్టైలిస్ట్ గా చేసింది. బయటి వాళ్లయితే తిట్టుంచుకుని పనిచేయించుకుంటాం. ఇంట్లో వాళ్లను ఏమనలేం. మళ్లీ ఇంటికెళ్లి ముఖాలు చూసుకోవాలి (నవ్వుతూ). సుష్మిత కు నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు.

సుష్మిత మాట్లాడుతూ..‘ఈ ప్రాజెక్టుకే కాదు..నా లైఫ్ లో జరిగిన ఇంపార్టెంట్ విషయాలకు చరణ్ నాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. అవకాశాలు కోసం చూడకుండా మనమే రీక్రియేట్ చేయాలన్న మా నాన్న మాటలు నాకు స్ఫూర్తినింపాయి. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ సిరీస్ విషయానికొస్తే.. ఆనంద్ రంగా ఎక్స్ లెంట్ గా రూపొందించాడు. టీమ్ అంతా బాగా కష్టపడ్డారు. ప్రకాష్ రాజ్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తేజ, నందిని సహా యాక్టర్స్ అంతా సపోర్ట్ చేశారు. కరోనా టైమ్ లో చాలెంజింగ్ గా తీసుకుని షూట్ చేశాం’ అని అన్నారు. ‘మమ్మల్ని, మా టీమ్ ని విష్ చేయడానికి వచ్చిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్’ చెప్పారు డైరెక్టర్ ఆనంద్ రంగా. కార్యక్రమంలో నందినిరెడ్డి, జీ5 హెడ్ నిమ్మకాయల ప్రసాద్ తో పాటు టీమ్ పాల్గొన్నారు.