Breaking News

షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

నిధి అగర్వాల్.. ఈ అమ్మడు చేసినవి నాలుగు సినిమాలే. యాక్టింగ్ కంటే అందాల విందుతోనే ఎక్కువ ఆకట్టుకుంది ఈ ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అందులో మూడు తెలుగు సినిమాలు. గతేడాది పూరీ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అమ్మడి స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. దీంతో తమిళంలో ‘భూమి’ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేంట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనుంది. లాక్ డౌన్ వల్ల ఈ రెండు సినిమాల షూటింగ్లు వాయిదా పడ్డాయి.

సెలబ్రిటీలు తమ సమయాన్ని ఏదో రకంగా ఉపయోగించుకుంటున్నారు. వారిలో నిధి కూడా ఉంది. అలాగే ఇలాంటి సమయం మళ్లీ రాదు అని కూడా అంటోంది. ఎందుకంటే ‘స్టార్స్ జీవితాలు చాలా బిజీగా ఉంటాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్టయ్యిందంటే అసలు తీరికే చిక్కదు. అందుకే ఈ టైమ్ ను కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి.. దానికోసం ఆన్ లైన్ యాక్టింగ్ కోర్స్ ద్వారా నా యాక్టింగ్ స్కిల్స్కి మరింత మెరుగులు దిద్దుతున్నా. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఈ కోర్సు ద్వారా యాక్టింగ్ స్కిల్స్ తో పాటు ఎలాంటి స్క్రిప్టు ఎంచుకోవాలి.. స్క్రిప్ట్ తగినట్టుగా ఎలా యాక్ట్ చెయ్యాలి.. ఎలాంటి మేకప్ అయితే కెమెరా ముందు బాగుంటుంది అన్న విషయాలు తెలుసుకుంటున్నాను. ఈ కోర్సులో వివరాలన్నీ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఎక్స్ పర్ట్ ఇచ్చినవి కాబట్టి నాకా బాగా హెల్ప్ అవుతున్నాయి. నటించడం చేతకాదని కాదు.. ఇంకా కెరీర్ ఆరంభంలోనే ఉన్నాను నేను. ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతోఉంది అంటోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. అందుకే ఈ సమయాన్ని ఇలా సద్వినియోగ పరచుకుంటున్నా. బోర్ కొడితే పబ్జీ ఆడుతున్నా..’ అంటోంది ఈ చిన్నది. షూటింగ్లు మొదలైతే తను నేర్చుకున్నదంతా ఉపయోగిస్తోందేమో.