సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో దుకాణాలు నిర్వహించుకునే వేళలు పెంచేలా అవకాశం కల్పించాలని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ను రిటైల్ వ్యాపార దుకాణ యజమానులు కోరారు. గురువారం వైఎస్సార్సీపీ ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. లాక్‌డౌన్ కారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను తెరుచుకుని వ్యాపారాలు జరుపుకుంటున్నామని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఉగాది, రంజాన్ తదితర పండగలు పోయాయని, ప్రస్తుతం దసరా ఉత్సవాల్లోపు దుకాణాల వేళలు పెంచేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ కలెక్టర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
- October 1, 2020
- Archive
- Top News
- కర్నూలు
- లోకల్ న్యూస్
- COVID19
- Kurnool
- MLA HAFIZKHAN
- ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
- కర్నూలు
- కోవిడ్19
- Comments Off on షాపులు నడుపుకునే సమయం పెంచండి