సారథి న్యూస్, శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 56,614 క్యూసెక్కులు కాగా… అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 848.70 అడుగులుగా నమోదు అయ్యింది.ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 77.1732 టీఎంసీలు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా ఉంది. వరద నీటి ప్రవాహంతో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- July 23, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- PROJECT
- SRISAILASM
- TMC
- టీఎంసీ
- ప్రాజెక్ట్
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద