Breaking News

శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత

శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత

శ్రీశైలం: జూరాల రిజర్వాయర్​ నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. డ్యాం నిండుకుండలా మారడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2,22,221 క్యూసెక్కులు ఉంది. ఔట్‌ఫ్లో 3,50,422 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.