Breaking News

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జలాశాయానికి మరింత వరద వచ్చింది. ఈ సీజన్‌లో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 3 టర్బయిన్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్​ఉత్పత్తిని ప్రారంభించలేదు. శ్రీశైలలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 77,534 క్యూసెక్కులు కొనసాగుతోంది. రిజర్వాయర్​పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 840.90 అడుగులు ఉంది. నీటి నిలువ సామర్థ్యం 215 టిఎంసీలు కాగా, ప్రస్తుతం63.1940 టీఎంసీలు ఉంది.