సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం పాతాళగంగ ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. బతుకుజీవుడా అంటూ సిబ్బంది పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్పారు. అయితే ప్రమాద తీవ్రతను అధికారులు పరిశీలిస్తున్నారు. లాన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో జెన్కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హతాశులయ్యారు. పొగలు కమ్ముకుంటుండడంతో ప్రాణంభయంలో పరుగులు తీశారు. కాగా, ఆగస్టు 20న భారీ అగ్నిప్రమాదం కారణంగా 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి మరమ్మతు పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. కాగా, లగేజీతో వచ్చిన డీసీఎం విద్యుత్ ఎంసీపీ బాక్స్‌ను తాకడంతోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్లు స్థానిక సిబ్బంది మీడియా ప్రతినిధులకు చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై అధికారులు, పోలీసులు స్పందిస్తూ.. మాక్‌డ్రిల్‌లో భాగంగా మంటలు వచ్చాయని చెప్పుకొచ్చారు.
- September 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- PATHALAGANGA
- POWERHOUSE
- SRISAILAM
- TSGENCO
- జెన్కో
- పవర్‌హౌస్
- పాతాళగంగ
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలం పవర్‌హౌస్‌లో మరోసారి మంటలు