సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలను తాకుతూ ఉరకలేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గురువారం సాయంత్రం రిజర్వాయర్10 గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగుల మేర ఉంది. అలాగే రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 208 టీఎంసీల నీటిమట్టం ఉంది.
- August 20, 2020
- Top News
- Kurnool
- SPILWAYGATES
- SRISAILAM PROJECT
- కర్నూలు
- గేట్ల ఎత్తివేత
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలం పదిగేట్ల ఎత్తివేత