సారథి న్యూస్, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి దర్శనాలను ప్రారంభించినట్టు దేవస్థాన ఈవో కేఎస్ రామారావు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆలయానికి రావొద్దని సూచించారు. క్యూలైన్లలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. శుక్రవారం స్థానికులకు దర్శనాలకు అవకాశం కల్పించామని.. శనివారం నుంచి దూరప్రాంతాల వారు రావొచ్చని సూచించారు. ఆలయసిబ్బందికి కరోనా రావడంతో కొంతకాలం క్రితం దర్శనాలను నిలిపివేశారు.
- August 14, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- Kurnool
- MALLIKARJUNASWAMY
- SRISAILAM
- TEMPLE EO
- ఈవో
- కర్నూలు
- మల్లికార్జునస్వామి
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలంలో దర్శనాలు ప్రారంభం