Breaking News

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

సారథి న్యూస్, తిరుపతి: జూన్ 24వ తేదీన బుధవారం తిరుమల శ్రీవారిని 9,059 మంది భక్తులు దర్శించున్నారు. స్వామి వారికి హుండీలో రూ.62లక్షల కానుకలు సమర్పించారు. 2,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ఈనెల 27వ తేదీన ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 26వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో అంటే విష్ణునివాసం (8 కౌంట‌ర్లు), శ్రీ‌నివాసం (6 కౌంట‌ర్లు)‌, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంట‌ర్లు), మొత్తం 18 కౌంట‌ర్లలో మూడువేల ఉచిత దర్శనం టోకెన్లను మంజూరు చేయ‌నున్నారు.