- కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి
న్యూఢిల్లీ: వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, శ్రామిక్ రైళ్లు ‘డెత్ పార్లర్లు’గా మారాయని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి విమర్శించారు. లాక్‌డౌన్ చాలా రోజుల ముందే పెట్టాల్సిందని, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వరకు ఆగి అప్పుడు పెట్టారని బీజేపీపై విమర్శలు చేశారు. మన దేశంలో జనవరిలోనే కరోనా కేసు నమోదైందని, అప్పుడే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు బంద్ పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత ప్రాబ్లం అయి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
మోడీ 2.0 ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, వాల్ల తప్పులు కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్రఇబ్బందులు పడ్డారని, అది హాఫ్ బాయిల్డ్ లాక్‌డౌన్ అని ఎద్దేవాచేశారు. వలస కార్మికులను సొంత ఊళ్లకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. ఆ రైళ్లలో 48 గంటల్లో 9 మంది చనిపోయారని విమర్శించారు.