సారథి న్యూస్, బిజినేపల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించి కరోనాను దూరం చేసుకోవచ్చని వైద్యాధికారి డాక్టర్ కల్పన సూచించారు. శుక్రవారం ఆమె నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో మాస్కులను పంపిణీ చేశారు. చేతులను తరుచూ సబ్బు లేదా శానిజైటర్తో శుభ్రం చేసుకోవాలని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ గోవిందు సుజాత, మాజిద్, సర్పంచ్ సితార, ఎంపీటీసీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- June 12, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- CARONA
- KHANAPUR
- NAGARKURNOOL
- బిజినేపల్లి
- మాస్క్లు
- Comments Off on శుభ్రంగా ఉంటేనే కరోనా దూరం