![శాస్త్రోక్తంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/ngkl-2-1.jpg?fit=677%2C522&ssl=1)
సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కొరవి రామనుజచార్యులు ధనుర్మాస ప్రత్యేక పూజలను గురువారం శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.ఆంజనేయులు, సహాయ అర్చకుడు కొరవి జయంత్, శుక్ల, చక్రపాణి, ఆలయ సిబ్బంది శివకుమార్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.