సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా, శాంతియుత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. కోవిడ్19 నిబంధనల మేరకు నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బాలాజీ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ రెడ్డి, డీఎస్పీలు వెంకట్రామయ్య, మహబూబ్ బాషా, రవీంద్రారెడ్డి, సీఐలు తబ్రేజ్, పవన్ కిషోర్, గణేశ్ఉత్సవాల నిర్వహణ కమిటీ కార్యాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, నగర అధ్యక్షుడు కిష్టన్న ఉన్నారు.
- August 30, 2020
- Archive
- Top News
- కర్నూలు
- లోకల్ న్యూస్
- COVID19
- GANESH NIMAJJANAM
- Kurnool
- SP FAKKIRAPPA
- ఎస్పీ ఫక్కీరప్ప
- కర్నూలు
- గణేశ్ నిమజ్జనం
- Comments Off on శాంతియుతంగా గణేశ్ నిమజ్జనోత్సవం