అక్కినేని అందగాడు నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’కు సంబంధించి ఎన్ఐఏ అధికారిగా కింగ్ శత్రువులను వేటాడుతున్న సీరియస్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ నేరస్తుల ఆటకట్టించే వైల్డ్ డాగ్ ఆపరేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. పోస్టర్లో చూపిన విధంగా టోటల్ 12 మిషన్లను సక్సెస్ చేసేందుకు ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ ఎలాంటి తెగువ చూపించాడనే తెరపై చూపిస్తున్నారట. వైల్డ్ డాగ్ నుంచి సెకండ్ లుక్ పోస్టర్ ఇది.
ఈ పోస్టర్ లో టీమ్ సభ్యులను కూడా పరిచయం చేశారు. నాగ్ తో ఆపరేషన్ లో పాల్గొనేది ఎందరు? అన్నది ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. దియామీర్జా, సయామి ఖేర్ ఇందులో యాక్షన్ క్వీన్ పాత్రలతో సర్ ప్రైజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తయింది. రొటీన్ మూవీలా కాకుండా ట్రూత్ ఇన్స్డెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది. పర్ఫెక్ట్టీమ్ వర్క్ కోసం హాలీవుడ్ నుంచి సాంకేతిక నిపుణులను బరిలో దించి పనిచేయిస్తున్నారు. అహిషోర్ సోలోమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.