Breaking News

వోటింగ్​లో వీక్​.. సూర్యకిరణ్​ అవుట్​

బిగ్​బాస్​- 4 హౌస్​ నుంచి ఫస్ట్ బయటకు వెళ్లేది తమిళదర్శకుడు సూర్యకిరణే అని సమాచారం. ఎలిమినేషన్​కు నామినేట్​ అయిన వాళ్లలో అతి తక్కువ మార్కులు ఉండటంతో బిగ్​బాస్​ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సారి బిగ్​బాస్​లో చాలా మంది కొత్తమొఖాలు కావడంతో ప్రేక్షకులు కూడా చాలా బోర్​గా ఫీలవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఇద్దరు కమెడియన్లు హౌస్​లోకి వైల్డ్​కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హౌస్​లో చాలామందికి తెలుగు మాట్లాడకపోవడంతో ప్రేక్షకులు చాలా ఇబ్బందిపడుతున్నారట. ప్లాప్​ అయిన తమిళ డబ్బింగ్​ సినిమాను బలవంతంగా చూస్తున్నట్టు కొందరు ప్రేక్షకులు సోషల్​మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్​బాస్​ ప్రారంభమైనప్పటి నుంచి మేమ్స్​ ఓ రేంజ్​లో వస్తున్నాయి.

సూర్యకిరణ్​ వోటింగ్​లో వెరీ పూర్​..
సూర్య కిరణ్ బయటకు వెళ్లిపోతాడని లీక్​లు వచ్చేశాయి. అయితే సూర్యకిరణ్​ ఎందుకు ఎలిమినేట్​ కాబోతున్నాడన్నవిషయం చర్చనీయాంశంగా మారింది. అనవసర విషయాల్లో దూరిపోయి లెక్చర్లు ఇవ్వడం, నోరు పారేసుకోవడంతో సూర్యకిరణ్​ పట్ల ప్రేక్షకుల్లో నెగిటివ్​ అభిప్రాయం ఏర్పడిందట. దీంతో సూర్యకిరణ్​కు ఓటింగ్​ పడలేదని సమాచారం. సూర్య కిరణ్.. తెలుగులో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడాకులు తీసుకున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్‌లో గంగ‌వ్వ‌, అభిజిత్‌, మెహ‌బూబ్ దిల్‌సే, అఖిల్ సార్థ‌క్‌, సూర్య కిర‌ణ్‌, సుజాత‌, దివి వైద్య ఉన్నారు.​ గంగవ్వ, అభిజిత్​, సుజాత ఇప్పటికే నామినేషన్​ నుంచి తప్పించుకున్నారు.