Breaking News

వైస్ ​ఎంపీపీ ఇంట్లోనే పేకాట

సారథిన్యూస్​, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​లోని వైస్​ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్​కుమార్​, ఎస్సై మస్తాన్​ సిబ్బంది పాల్గొన్నారు.