Breaking News

వైల్డ్ జగదీష్..

వైల్డ్ జగదీష్..

నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్​టైన్​ ‘టక్ జగదీష్’. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. నాని నటిస్తున్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ టైటిల్ పోస్టర్ లో టక్ చేసుకుని నిల్చుని ఉన్న నాని బ్యాక్ సైడ్ లుక్ ను చూపించిన మేకర్స్.. ఫస్ట్ లుక్ లో నాని నీట్ గా ఫార్మల్ డ్రెస్ లో టక్ చేసుకుని అరిటాకులో భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఉండడానికి క్లాస్ గా ఉన్నా చూపులు మాత్రం చాలా వైల్డ్ గా ఉన్నాయి. కోపంగా చూస్తూ షర్టు వెనకనుంచి కత్తి తీస్తూ ఉన్న మాస్ లుక్ తో అదరగొడుతున్నాడు. క్లాస్ డ్రెస్ తో మాస్ లుక్ తో ఉన్న ఈ సింగిల్ పోస్టర్ తో ‘టక్ జగదీష్’ సినిమాపై అంచనాలు పెంచేశాడు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్​లో మరో సూపర్ హిట్ రాబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది. 2021 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నాజర్, డేనియల్ బాలాజీ, ప్రియదర్శి, తిరువీర్, రోహిణి, ప్రవీణ్, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.