Breaking News

వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

వైభవంగా తుంగభద్ర పుష్కరాలు


  • ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం
  • ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్​యాదవ్​

సారథి న్యూస్, కర్నూలు: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, అందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుంగభద్ర ఏర్పాట్లకు సంబంధించి మంత్రి దృష్టికి తెచ్చారు. అందుకు స్పందించిన మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. పుష్కరాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. ఘాట్లకు సమీపంలోనే దేవాయాలు ఉండేలా చూసుకోవాలని, బ్రాహ్మణులకు సకల సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యేకు సూచించారు. పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాని, ఇందుకు తమవంతు సహకారం అందిస్తామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హామీ ఇచ్చినట్లు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ తెలిపారు.