Breaking News

వైద్యసేవలు బాగుండాలె


సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హన్మంత్ శుక్రవారం వెంకటాపురం తహసీల్దార్ ఆఫీసు మరమ్మతులు పరిశీలించారు. అనంతరం ఎదిరా ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అలుబక గ్రామంలో నర్సరీ మొక్కలు పరిశీలించారు. హరితహారం కింద అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి, ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్​ చుట్టాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్లు, ఇంకుడుగుంతలు పనులను కంప్లీట్​ చేయాలన్నారు. పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీ ట్యాంకర్ల కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. వ్యాధుల సీజన్ లో కరోనా, మలేరియా, డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్​ స్థలాల్లో చెత్తాచెదారం వేయకుండా ఆదేశాలు జారీచేయాలన్నారు. వెంకటాపురం మండలం ఏదిర హెల్త్​సెంటర్​ను కలెక్టర్ సందర్శించారు. గర్భిణులు, మందుల వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట వెంకటాపురం తహసీల్దార్ నాగరాజు, డీటీ రాము, రఫీ ఉన్నారు.