సారథి న్యూస్, ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు దశలవారీగా రూ.75వేలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తామన్నారు. మహిళలకు మొదటి విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున మొత్తం 9,949 మంది లబ్ధిదారులకు రూ.18.65కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎంపీడీవో వెంకటరమణ, నందవరం ఎంపీడీవో ఫజల్ బాషా, డీఆర్ డీఏ ఏరియా కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఏపీఎం ఈరన్న పాల్గొన్నారు.
- August 12, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ANDRAPRADESH
- CM JAGAN
- EMMIGANUR
- Kurnool
- YSRCHEYUTHA
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- వైఎస్సార్చేయూత
- సీఎం జగన్
- Comments Off on ‘వైఎస్సార్ చేయూత’ మహిళలకు వరం