టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్ ఓ వేశ్య పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. రకుల్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. అన్ని భాషాల్లోనూ ఆమె గ్లామర్‌డాల్ గానే కనిపించిందే తప్ప నటనకు అవకాశం ఉన్న ఒక్కపాత్ర ఆమెకు దక్కలేదనే చెప్పాలి. తెలుగులో పూజాహెగ్గే, రష్మిక మందన్నా వంటి హీరోయిన్ల ఎంట్రీతో రకుల్‌కు అవకాశాలు తగ్గాయి. తమిళంలోనూ ఆమెకు అవకాశాలు దక్కడం లేదు. దీంతో నటనకు అవకాశం ఉన్న ఓ వేశ్యపాత్రలో ఆమె నటించనున్నట్టు సమాచారం. ముంబైకి చెందిన ఓ వేశ్యనిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖదర్శకుడు ఈ చిత్రానికి కథను సిద్ధం చేశారట. ఈ చిత్రంలో రకుల్ ఓ రేంజ్లో అందాలను ఆరబోయనున్నట్టు సమాచారం. తెలుగు తమిళంలో అవకాశాలు లేక రకుల్ ఈ పాత్రకు ఒప్పుకున్నారని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట.
- July 14, 2020
- Archive
- సినిమా
- BOLLYWOOD
- RAKUL
- ROMANTIC
- TELUGU
- రకుల్ ప్రీత్‌సింగ్
- Comments Off on వేశ్యగా రకుల్ ప్రీత్