Breaking News

వేతనాల సలహాబోర్డును ఏర్పాటు చేయాలి

వేతనాల సలహాబోర్డును ఏర్పాటుచేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహాబోర్డును వెంటనే ఏర్పాటుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లా కార్మికశాఖ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో సుమారు 50లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, 13 ఏళ్లుగా సవరించకపోవడంతో కనీస వేతనాలు పొందలేకపోతున్నారని అన్నారు. కార్మికులు ప్రతినెలా రూ.వెయ్యి కోట్లు నష్టపోతున్నారని వివరించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆక్షేపించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు, ఎన్.వీ రమణ, అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.గురునాయడు, అరబిందో, శ్యాంపిస్టన్స్, నాగార్జున అగ్రికెమ్, యునైటెడ్ బ్రేవరీస్, శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ తదితర పరిశ్రమల యూనియన్ ల నాయుకులు జె.గంగరాజు, ఐ.నారాయణరావు ఎన్.వరదరాజులు, సత్యనారాయణ, శ్యాంసుందర్, ఎస్.ముకుందరావు, పల్లి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.