Breaking News

వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామంలో వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ను మంత్రులు కె.తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఫ్లోరింగ్ సొల్యూషన్స్, కార్పెట్ టైల్స్, గ్రీన్స్(కృత్రిమ గడ్డి), బ్రాడ్‌లూమ్ తివాచీలు (వాల్ టు వాల్ కార్పెట్)లను తయారుచేసేందుకు యూనిట్​ సిద్ధమైంది. గుజరాత్‌కు చెందిన కంపెనీ తెలంగాణలో రూ.రెండువేల కోట్ల పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని మంత్రి కేటీఆర్​అన్నారు. ఈ పారిశ్రామిక క్లస్టర్‌లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. వెల్​స్పన్​ ఫ్లోరింగ్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో ముఖేష్ సావ్లాని తదితరులు పాల్గొన్నారు.