తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అనుష్క, సైజ్ జీరోలో చేసిన ప్రయోగంతో డీలా పడిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఇటీవల ఆమె కొన్ని లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో బాగానే గుర్తింపు పొందింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు అనుష్కను ప్రధానపాత్రలో పెట్టి ఓ భారీ వెబ్‌సీరిస్‌ను ప్లాన్ చేశారట. దీనికి ఈ ముద్దుగుమ్మ మాత్రం నో చెప్పినట్టు టాక్. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు స్వీటీ ఎందుకు నో చెప్పిందా అని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే తేడా కొట్టినట్టు టాక్ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వారు ఈ చిత్రంలో ఏ ముద్దుగుమ్మకు ఏ మేరకు అవకాశం ఇస్తారో వేచిచూడాలి.