సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడగు, శ్రీరాములపల్లిలో వైద్య ఆరోగ్యశాఖ వృద్ధుల కోసం ‘ఆలన’ అనే ఓ ప్రత్యేకకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించి.. వారికి అవసరమైన మందులు అందజేశారు. బీపీ, షుగర్, పక్షవాతం, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్లు సయ్యద్, అబ్దుల్ రఫె, వైద్యసిబ్బంది శ్రీనివాస్, రమణమూర్తి, సంధ్య, శ్రీలత, రాజేశ్వరి, బూదమ్మ, ఆశాలు మమత, అంజమ్మ, సుజాత శశికళ , వేదిర ఉపసర్పంచ్ సత్యనారాయణ, కారొబార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- July 10, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DOCTORS
- KARIMNAGAR
- NURSE
- RAMADUGU
- VILLAGES
- కరీంనగర్
- రామడగు
- Comments Off on వృద్ధులకు ఆలన