సారథి న్యూస్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో మామిడి హరికృష్ణ రచించారు. పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను సీఎం కేసీఆర్అభినందించారు. వృక్షాలను ధైర్యంగా భావించే సంస్కృతి మనదని గుర్తుచేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఓఎస్ డీ దేశపతి శ్రీనివాస్. సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రముఖ యువ దర్శకుడు పూర్ణచందర్ బాదావత్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వైస్ ప్రెసిడెంట్ రాఘవ పాల్గొన్నారు.
- December 7, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- షార్ట్ న్యూస్
- CM KCR
- GREEN INDIA
- JOGINIPALLY
- VRUKSHA VEDAM
- గ్రీన్ ఇండియా
- జోగినిపల్లి
- వృక్షవేదం
- సీఎం కేసీఆర్
- Comments Off on ‘వృక్షవేదం’ పుస్తకావిష్కరణ