భోపాల్: దొంగల్లోను చాలా రకాలుంటారు. వాళ్ల అభిరుచులు కూడా భిన్నమే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులకు చిక్కిన ఓ దొంగ మాత్రం చాలా విచిత్రమైన దొంగ. ఈ దొంగ కేవలం బాలికలు, యువతుల లోదుస్తులను మాత్రమే కాజేస్తాడు. అనంతరం వాటిని చింపి పీలికలు చేసి పడేసి పైశాచిక ఆనందం పొందుతాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో లేడిస్ హాస్టల్స్, యువతులు అద్దెకుండే నివాసాల్లో కొంతకాలంగా రాత్రివేళల్లో లోదుస్తులు మాయం అవుతున్నాయి. దీంతో బాధిత మహిళలు విజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో లోదుస్తులను దొంగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. మానసిక ఆనందం కోసమే ఇలా చేశానని పొలీసులకు చెప్పడం గమనార్హం.
- July 27, 2020
- Archive
- క్రైమ్
- జాతీయం
- GIRLS
- MADYAPRADESH
- POLICE
- YOUNG
- దొంగ
- లోదుస్తులు
- Comments Off on వీడోరకం దొంగ