హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీఏవోలు, వీఆర్వోలకు తీపికబురు అందించారు. ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తీసుకొస్తున్నామని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వీఏవోలను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. వారి అర్హతలను బట్టి ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో వీఆర్వోలను భర్తీ చేస్తామన్నారు. రెవెన్యూ సంస్కరణ వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని సీఎం స్పష్టంచేశారు. సంస్కరణల వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా కృషిచేస్తున్నామని అన్నారు.
- September 9, 2020
- Archive
- Top News
- CM KCR
- REVENUE ACT
- TELANGANA
- VAO
- VRO
- తెలంగాణ
- పంచాయతీరాజ్‌శాఖ
- రెవెన్యూ బిల్లు
- వీఆర్వోలు
- వీఏవోలు
- సీఎం కేసీఆర్
- Comments Off on వీఆర్వోలకు ఏమీ కాదు