Breaking News

విస్తృతంగా అవెన్యూ ప్లాంటేషన్

మహబూబాబాద్​: మహబూబాబాద్​ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్​ ను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్​ వీపీ గౌతం ఆదేశించారు. మంగళవారం హరితహారం పల్లెప్రగతి పనులను పరిశీలించేందుకు కేసముద్రం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కేసముద్రం పట్టణం, ఇనుగుర్తి, లాలూ తండా, తౌర్య తండాల్లో పర్యటించి హరితహారం తీరు తెన్నులను పరిశీలించారు. లాలూ తండాలోని 4 ఎకరాల్లో చేపట్టిన అటవీశాఖ నర్సరీని సందర్శించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో రోజా రాణి తదితరులు ఉన్నారు.

అబార్షన్లు చేస్తే క్రిమినల్ కేసులు
ప్రభుత్వ, ప్రైవేట్​ వైద్యులు, సిబ్బంది అబార్షన్లకు సహకరిస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని మహబూబాబాద్ కలెక్టర్​ వీపీ గౌతమ్​ హెచ్చరించారు. మంగళవారం ఆయన కేససముద్రం మండలంలో పర్యటించారు. హాస్పిటల్​లో సౌకర్యాలపై వైద్యసిబ్బందిని ప్రశ్నించారు. పీహెచ్​సీలో కాన్పులసంఖ్య తక్కువగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.