సారథి న్యూస్, విశాఖపట్నం: వరుస ప్రమాదాలతో విశాఖపట్నం వణికిపోతోంది. తాజాగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో మరో అగ్నిప్రమాదం జరిగింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన పోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంజన్ రూమ్‌లో కావడంతో గ్యాస్ మాస్కులు ధరించి సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, శనివారం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వెంటనే మంటలను గుర్తించిన మత్స్యకారులు పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు కిందకు దూకి ఒడ్డు చేరుకోవడంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. రూ.50 లక్షలు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలిసింది. హార్బర్‌లో ఓ బోటు చేపలవేటకు వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- August 10, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- FIREACCIDENT
- FISHINGHARBER
- PORTTRUST
- VISHAKAPATNAM
- ఇంజిన్రూమ్
- పోర్ట్‌ట్రస్ట్
- విశాఖపట్నం
- Comments Off on విశాఖలో వరుసగా..