- ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా…గుట్టు రట్టు
సారథి న్యూస్ విశాఖపట్నం : విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మద ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లిదండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరువాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్‌తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్‌కమిషనర్‌ఆర్కే మీనా మీడియాతో మాట్లాడుతూ..పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మద సహా ఆరుగురుని అరెస్ట్ చేశామన్నారు. విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడించారు.