సారథి న్యూస్, కరీంనగర్: నేటి యువతకు స్వామి వివేకానందుని జీవితం ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా దేశంలోని యువకులు, ప్రజలను సంఘటితం చేయడానికి ఆయన ప్రసంగాలు దోహదపడ్డాయని గుర్తుచేశారు. మంగళవారం స్వామి వివేకానందుని 158వ జయంతి సందర్భంగా కరీంనగర్ టౌన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. భారతదేశం ఒక గొప్ప జ్ఞానసంపద కలిగిన దేశమని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులని కొనియాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలంటే ఆయన జీవిత చరిత్రను చదవాలని పిలుపునిచ్చారు. స్వామి జీవించిన 39 ఏళ్లలో వారు అందించిన ఆదర్శ జీవితం చాలా స్ఫూర్తిదాయకమన్నారు.
- January 12, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- BJP BANDI SANJAY
- KARIMNAGAR
- SWAMY VIVEKANDA
- కరీంనగర్
- బీజేపీ బండి సంజయ్
- వివేకానందుని
- Comments Off on వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం