హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహితపై ముగ్గురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని కొల్లూరు తండాకు చెందిన మహిళ(30)ను ఓ వ్యక్తి నమ్మించి వెంట తీసుకెళ్లాడు. అక్కడే వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లగా, మరో ఇద్దరు వ్యక్తులు అతనికి తోడయ్యారు. మద్యం మైకంలో ముగ్గురూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కిరాతకంగా చంపేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, మృతురాలి భర్త 12 ఏళ్ల చనిపోగా, తన ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తోంది. ఆమెపై కన్నేసి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రాపురం పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిసింది. కుటుంబసభ్యుల ఆరోపణల మేరకు మధు, చందులాల్, కుటుంబరావు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
- November 6, 2020
- Archive
- GANGRAPE
- HYDERABAD
- RAMACHANDRAOURAM
- SYBERABAD
- గ్యాంగ్‌రేప్
- రామచంద్రాపురం
- సైబరాబాద్
- హైదరాబాద్
- Comments Off on వివాహితపై గ్యాంగ్ రేప్