ఫైటర్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పొన్నంబళమ్ విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. 90లో విలన్ గా పొన్నాంబళమ్ బాగా ఫేమస్ అయ్యారు. తెలుగులో కూడా ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల చిత్రాలతో పాటు శ్రీకాంత్, జగపతిబాబు నటించిన చిత్రాల్లోనూ కీలకపాత్రల్లో విలన్గా నటించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు పొన్నంబళమ్. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షణించింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబళమ్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొన్నాంబళమ్ చికిత్సకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నారట. ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్ అతడికి ఆర్థికసాయం చేయడానికి ముందుకొచ్చారు. అతడి పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని హామీఇచ్చారు. కాగా కమల్, పొన్నంబళమ్ అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, భారతీయుడు వంటి హిట్ చిత్రాల్లో నటించగా.. రజనీకాంత్ తో కలిసి ముత్తు, అరుణాచలం చిత్రాల్లో పనిచేశారు. చిరంజీవి ‘హిట్లర్’ మూవీలో కూడా విలన్గా నటించారు పొన్నంబళమ్.