సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి): లాక్ డౌన్ సమయంలో హయత్ నగర్ డివిజన్ లోని ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. డివిజన్ లో దాదాపు 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ నిరుపేదలు నివాసముంటున్నారని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో వారందరూ పనిచేస్తేగాని పూటగడవదని, కరోనా ప్రభావంతో పేద, మధ్య తరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లులను తప్పనిసరిగా చెల్లించాలని, ఆలస్యమైనా కరెంట్ బిల్లులు ఫైన్‌తో చెల్లించాలని ఆదేశించడం బాధాకరమన్నారు. పనిచేస్తేనే కడుపు నిండని నిరుపేదలు అధిక విద్యుత్ ఛార్జీలను ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. మానవత్వంతో మాఫీ చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- June 11, 2020
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- CONGRESS
- POWER BILLS
- గుర్రం శ్రీనివాస్ రెడ్డి
- హయత్ నగర్
- Comments Off on విద్యుత్ బిల్లులు మాఫీ చేయండి